ETV Bharat / state

రూ. 1.43 కోట్ల విలువైన కారం పొడి సీజ్ - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లాలో ‌కారం తయారీ గోదాములపై ఫౌరసరఫరాలశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 1.43 కోట్ల విలువైన కారం పొడిని సీజ్ చేశారు.

Gaus Mohiddin
ఫుడ్‌ సేఫ్టీ కంట్రోలర్‌ గౌస్‌మొహీద్దీన్‌
author img

By

Published : Apr 9, 2021, 5:06 PM IST

గుంటూరు జిల్లాలో కల్తీ చేసి విక్రయిస్తున్న ఆహార పదార్ధాలపై రెండో రోజూ తనిఖీలు కొనసాగాయి. గుంటూరు నగర శివారులోని మిర్చియార్డు సమీపంలోని మిర్చి కారం తయారీ గోదాముల్లో తనిఖీలకు వెళ్లిన అధికారులు ఐదు సంస్థలకు సంబంధించిన రూ.1.43 కోట్ల విలువైన 72వేల కిలోల మిరప పొడిని సీజ్‌ చేశారు. ఇందులో కొన్ని సంస్థలు ఎటువంటి ట్రేడ్‌ లైసెన్సు లేకుండానే తయారీ, లేబుల్స్‌ లేకుండా విక్రయాలు చేయటాన్ని గుర్తించిన అధికారులు వాటిని సీజ్‌ చేశారు.

కారం తయారీకి కొన్ని నాణ్యతా ప్రమాణాలున్నాయని.. అయితే ఇక్కడ అటువంటివి పాటించకుండా తాలుకాయలతో కారం తయారు చేస్తున్నారని ఫుడ్‌ సేఫ్టీ కంట్రోలర్‌ గౌస్‌మొహీద్దీన్‌ తెలిపారు. అయితే దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్ముందు కూడా తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్న ఆయన.. గుంటూరు జిల్లాలో కల్తీలను పూర్తిగా నియంత్రించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, తూనికలు కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వారే.. వకీల్ సాబ్​ను చూసి భయపడతారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.