ETV Bharat / state

పర్యాటక కేంద్రంగా నెల్లూరు నగరం - నెల్లూరు నగరం

నెల్లూరు నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నల్ల చెరువు తో పాటు, పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.

పర్యాటక కేంద్రంగా నెల్లూరు నగరం
author img

By

Published : Feb 6, 2019, 5:18 AM IST

పర్యాటక కేంద్రంగా నెల్లూరు నగరం
నెల్లూరు నగరం పర్యాటకంగా అభివృద్ది చెందేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. నగరాన్ని పచ్చదనంతో నింపేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరానికి సమీపంలో 3 వందలకు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న నెల్లూరు చెరువు ట్యాంక్ బండ్​లా మారబోతుంది. ఇందుకోసం 80 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు, జాతీయ నాయకుల విగ్రహాలు, బోటు షికారు ఏర్పాటు చేస్తూ మరో ట్యాంక్ బండ్ లా రూపుదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం 25కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.
undefined
8 లక్షలకు పైగా జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ఆహ్లాదకరమైన ప్రాంతాలే లేవు. ఖాళీ సమయాల్లో సరదాగా గడిపేందుకు చక్కటి స్థలాలే లేని పరిస్థితి. గత నాలుగేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరాలు, పట్టణాల్లో పచ్చదనం అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో నెల్లూరు నగరం పర్యాటకం కేంద్రంగా మారింది. ప్రతీ కాలనీల్లో పార్కులు ఏర్పాటయ్యాయి.
పార్కుల అభివృద్ధి మాత్రమే కాక, నగరంలో ఉన్న స్వర్ణాల చెరువును 'నెక్లెస్ రోడ్డు' మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారు. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ పేరుతో సుమారు 10 కోట్లు ఖర్చు చేశారు. బోటింగ్ ఏర్పాటుతో విహార కేంద్రంగా మార్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఇరుకళల పరమేశ్వరీ ఆలయం ఈ నల్లచెరువులోనే ఉంది. ఈ ఆలయం వద్ద పుష్కరిని, ఘాట్ ఏర్పాటు చేస్తున్నారు.
నుడా ఆధ్వర్యంలో ప్రణాళికతో నిర్మాణపనులు వేగంగా చేస్తున్నారు. నెల్లూరు నగరానికి తలమానికంగా మారనున్న ట్యాంక్ బండ్​పై రాష్ట్రానికి చెందిన 15 జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. చక్కటి పార్కులు నిర్మించనున్నారు. పిల్లలు ఆటలాడుకునేందుకు ప్రత్యేక పార్కు. వాకింగ్ ట్ర్యాక్, సైకిల్ నడిపేందుకు ట్రాక్, గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు.
స్వర్ణాల చెరువు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేందుకు వేగంగా పనుల చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్ణాల చెరువును నెక్లెస్ రోడ్డుగా మారిస్తే నెల్లూరు నగరం పెద్ద పర్యాటక కేంద్రంగా మారుతుంది.

New Delhi, Feb 05 (ANI): While speaking to ANI on CBI issue, Congress MP Adhir Ranjan Chowdhury said, "There is no democracy in West Bengal, it's with the help of ruling government that people were looted off in the Chit Fund Scam. This Police Commissioner is Mamata's servant he will do whatever she says."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.