కడియంలో ఉచిత వైద్య శిభిరం తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఎంపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కేన్సర్ వైద్య పరీక్షల కోసం రెండు కోట్ల రూపాయల ఎంపీ నిధులతో మొబైల్ వ్యాన్ ను ఏర్పాటు చేశారు. కేన్సర్ తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు సరఫరా చేశారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.