ETV Bharat / state

Polavaram Project: జగన్​ హయాంలో "పోలవరం అట్టర్​ ఫ్లాప్"​.. ఆ మాటలే నేడు నిజమైన వైనం..! - polavaram project authority

Polavaram Project Fails In ycp Government: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం అనిశ్చితిలో పడింది. ముందుచూపు, సరైన వ్యూహం, అంకితభావం లేని పాలకులు.. అత్యంత ప్రధానమైన ప్రాజెక్టును సుడిగుండంలోకి నెట్టేశారు. వేగంగా సాగుతున్న పనులను అడ్డుకోవద్దని పీపీఏ నెత్తీనోరూ మొత్తుకున్నా, రివర్స్‌ టెండర్లతో ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించినా.. జగన్‌ ప్రభుత్వం దానిని పెడచెవిన పెట్టింది. ఎవరి మాటా వినకుండా.. నిబంధనలు సవరించి మరీ అస్మదీయులకు పనులు కట్టబెట్టింది. రివర్స్‌ టెండర్లతో ఖర్చు తగ్గిస్తామని గొప్పలు పోతే.. ఇప్పుడేమో వ్యయం తడిసి మోపెడవుతోంది. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న పనులు.. సుమారు 40 నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. అసలు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని దుస్థితి ఏర్పడింది. పాలకుల చేతగానితనంతో పోలవరం "మెగా ఫ్లాప్‌" అయింది.

Polavaram Project
Polavaram Project
author img

By

Published : May 12, 2023, 7:31 AM IST

జగన్​ హయాంలో "పోలవరం అట్టర్​ ఫ్లాప్"​.. ఆ మాటలే నేడు నిజమైన వైనం..!

Polavaram Project Fails In ycp Government: టీడీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులకు.. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే బ్రేక్‌ పడింది. ఆ సంవత్సరం ఆగస్టులోనే అప్పటి గుత్తేదారు సంస్థను పనులు చేయకుండా ఆపేసిన ప్రభుత్వం.. జగన్‌ అస్మదీయ సంస్థకు అప్పజెప్పేలా పావులు కదిపింది. ఇంత ఖర్చు అవసరం లేకుండా చాలా తక్కువకే ప్రాజెక్టు కట్టేస్తామని గొప్పలకు పోయింది. ప్రధాన డ్యాంలో అప్పటికి మిగిలి ఉన్న 17వందల 71.44 కోట్ల రూపాయల విలువైన పనికి ఆగస్టు 17న కొత్త టెండర్ ప్రకటన ఇచ్చింది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న కాంట్రాక్టరు మరో 14 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా.. కొత్త కాంట్రాక్టరుకు 24 నెలల గడువిచ్చింది. రివర్స్‌ టెండర్ల కోసం ఆగస్టు 16న జీవో 67 జారీ చేసి.. 2019 సెప్టెంబర్ 21 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చారు. రివర్స్‌ టెండర్ల నిర్వహణకు కనీసం ఇద్దరు బిడ్డర్లు ఉండాలని నిబంధన ఉన్నా.. మేఘా కంపెనీ ఒక్కటే టెండర్ వేసింది. 17వందల 71.44 కోట్ల రూపాయల విలువైన ప్రధాన డ్యాం పనులను 12.6 శాతం తక్కువతో 15 వందల 48 కోట్ల రూపాయలకే చేస్తామంటూ ఫైనాన్స్‌ బిడ్‌ వేసింది. ఈ మొత్తం ఇంటర్నల్‌ బెంచ్‌ మార్కు విలువ కంటే తక్కువగా ఉన్నందున.. రివర్స్‌ టెండర్లు నిర్వహించకుండానే మేఘాకు అప్పగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సాంకేతిక అర్హతలనూ మార్చిన జగన్‌ ప్రభుత్వం: పోలవరం పనులు అస్మదీయులకు అప్పగించేందుకు గుత్తేదారు సంస్థకు ఉండాల్సిన సాంకేతిక అర్హతలనూ జగన్‌ ప్రభుత్వం మార్చేసింది. కొన్నింటిని మినహాయించింది. 2012లో ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడు.. 1.3 నిబంధన కింద గత పది సంవత్సరాల్లో కనీసం 35 మీటర్ల ఎత్తున ఒకటైనా స్పిల్‌వే, కాంక్రీట్‌ డ్యాం, మట్టి కట్ట, రాక్‌ఫిల్‌ డ్యాం, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించిన అనుభవం ఉండాలన్నారు. 2019లో రివర్స్‌ టెండర్లు పిలిచినప్పుడు ఆ నిబంధన మినహాయించారు. 2012 టెండర్లలో 2.2 నిబంధన కింద ప్రధాన కాంట్రాక్టరుగా లేదా జాయింట్‌ వెంచర్‌లో... గత 10 ఆర్థిక సంవత్సరాల్లో రాతి, మట్టికట్ట డ్యాంలు, కాంక్రీటు డ్యాంలు లేదా బ్యారేజీలు, స్పిల్‌వేల పనిచేసి ఉండాలని నిబంధన పెట్టారు. 2019 రివర్స్‌ టెండర్లలో డ్యాంలు, స్పిల్‌వేల ప్రస్తావన లేకుండా మార్చివేశారు. అంటే పోలవరం వంటి ప్రధాన డ్యాం నిర్మించడానికి అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా.. సాంకేతిక అర్హతల్లో మార్పులు చేశారు. అందువల్లే మేఘా సంస్థకు అవకాశం దక్కిందన్న విమర్శలు వచ్చాయి.

మరో683 కోట్ల రూపాయల పనులు: పోలవరం ప్రధాన డ్యాంలో స్పిల్‌ ఛానల్‌ చివర్లో 13వందల 54 మీటర్ల పొడవున కటాఫ్‌ డయాఫ్రం వాల్‌ నిర్మించాలని 2021లో ప్రతిపాదించారు. ప్రధాన డ్యాం మూడో గ్యాప్‌లో 140 మీటర్ల పొడవున అనుకున్న మట్టి డ్యాంను కాంక్రీటు డ్యాంగా మార్చారు. స్పిల్‌ ఛానల్‌ కుడివైపున కొండవాలు రక్షణ పనులు ప్రతిపాదించారు. 683 కోట్లతో చేపట్టే ఈ పనులన్నింటినీ పాత ధరలతో నామినేషన్‌పై తొలుత మేఘాకు ఇచ్చేయాలని అధికారులు యత్నించారు. ఆ తర్వాత టెండర్లు పిలిచినా రెండు సంస్థలే పోటీ పడ్డాయి. అందులో ఒకటి మేఘా, మరొకటి H.E.S. ఈ పనులకు 0.9 శాతం తక్కువకు మేఘా బిడ్‌ వేసింది.

రివర్స్‌ టెండర్లలో I.B.M విలువపై 2 శాతం తక్కువకు చేసేందుకు అంగీకరించడంతో... వాళ్లకే పనులు దక్కాయి. పోలవరం ప్రధాన డ్యాంను ఆసరాగా చేసుకుని కొత్త ఎత్తిపోతలకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ప్రాజెక్టులో +35.51 మీటర్ల దిగువ నుంచి +32 మీటర్ల మధ్య ఉన్న నీటిని జనవరి, ఏప్రిల్‌ నెలల మధ్య ఎత్తిపోసి... వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు మళ్లించాలని ప్రతిపాదించారు. దీన్ని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించారు. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా 776 కోట్లతో కొత్తది అవసరం లేదని జలవనరుల నిపుణులూ అభిప్రాయపడ్డారు. అయినా ఎత్తిపోతలకు టెండర్లు పిలవడం, 765.94 కోట్లకు మేఘా సంస్థ దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి.

పోలవరం ప్రధాన డ్యాంలో తాజాగా 15వందల 99.21 కోట్ల పనులు కూడా మేఘాకు దక్కాయి. డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం, భారీ వరదలకు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట అగాథాలు ఏర్పడటంతో... వాటిని సరిదిద్దే పనులకు 16వందల 15.75 కోట్లవుతుందని అంచనా వేశారు. రివర్స్ టెండరింగ్‌లో రెండు సంస్థలే పాల్గొనగా.. 15వందల 99.21 కోట్లకు మేఘా దక్కించుకుంది. పోలవరం డ్యాం మొత్తం 15వందల 48 కోట్లకే పూర్తి చేసేందుకు అప్పట్లో నిర్ణయించగా.. ఈ నాలుగేళ్లలో అదనపు పనులు, అవసరం లేని ఎత్తిపోతల నిర్మాణం లాంటివన్నీ కలిపి మేఘాకు అదనంగా సుమారు 3వేల కోట్ల పనులు ఇవ్వడం గమనార్హం.

ఆ హెచ్చరికే నిజమైంది: పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నా.. కేంద్రమే నిధులిస్తోంది. అందువల్ల నిర్ణయాలన్నీ కేంద్ర జల్‌శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతితోనే తీసుకోవాలి. సాంకేతిక అంశాలు, డిజైన్లపై డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం అనుమతులతోనే ముందుకెళ్లాలి. కానీ 2019లో వైకాపా ప్రభుత్వం కేంద్రం లేదా P.P.A ఆమోదం లేకుండానే రివర్స్‌ టెండర్లకు వెళ్లింది. ఈ విషయం తెలియగానే 2019 ఆగస్టు 13న హైదరాబాద్‌లో పీపీఏ అత్యవసర సమావేశం నిర్వహించింది. రీటెండర్లతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని, పనులు ఆలస్యం అవుతాయని అథారిటీ ఛైర్మన్ సహా ఉన్నతాధికారులు హెచ్చరించారు. రీటెండర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి P.P.A లేఖ కూడా రాసింది.

కొత్త టెండర్లతో జరిగే నష్టంపై కేంద్ర జల్‌శక్తి శాఖకు P.P.A నివేదిక పంపింది. అప్పటికే ఉన్న గుత్తేదారు సంతృప్తికరంగా పనులు చేస్తున్నందున... ఒప్పందం రద్దుకు ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టంచేసింది. కొత్త గుత్తేదారు పనులు చేపడితే ఆలస్యమవుతుందని... ఒకవేళ సాంకేతిక లోపాలు వస్తే బాధ్యత ఎవరిదో తేల్చడం కష్టమని అభిప్రాయపడింది. P.P.A అనుమానాలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైపోయింది. మేఘా వచ్చిన తర్వాత చాలాకాలం పనులు వేగం పుంజుకోలేదని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ప్రధాన డ్యాం ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు, డయాఫ్రం వాల్‌ సమస్య.. ప్రాజెక్టు భవితవ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టివేశాయి.

మాటమార్చిన అధికారులు: ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లు సకాలంలో పూడ్చకపోవడమే ఈ గుంతలకు కారణమని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు తేల్చారు. ఇక 2020 ఏప్రిల్‌ నుంచి కరోనా వ్యాప్తి చెందడం కూడా పనుల ఆలస్యానికి ఒక కారణమని చెబుతున్నారు. పాత ఏజెన్సీతో పనులు కొనసాగించి, ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేసుకుని ఉంటే... పోలవరంలో మెగా ఉత్పాతాలకు ఆస్కారం ఉండేది కాదన్న అభిప్రాయమూ ఉంది. 2021 జనవరిలో P.P.A సీఈవోకు ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదిక చూస్తే... 2019కు ముందు, ఆ తర్వాత ఎంత పని జరిగిందో స్పష్టంగా వివరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర అధికారులు మాట మార్చేశారు.

ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లు పూడ్చవద్దని చెప్పడం వల్లే వదిలేశామంటూ P.P.A. పైకి నెట్టేశారు. స్పిల్‌వే నిర్మాణం పూర్తి చేయకుండా ఎగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టడం వల్లే సమస్యలు తలెత్తాయని, అందుకే నిర్మాణం ఆగిపోయిందని ముఖ్యమంత్రి జగన్, జలవనరుల శాఖ మంత్రి పదే పదే ఆరోపించారు. అయితే.. పోలవరాన్ని పరిశీలించిన హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల కమిటీ... స్పిల్‌వే పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించడం తప్పని నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ లేదా డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ ఇది తప్పని అన్నట్లు.. ఆధారసహితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పలేకపోయింది.

అది పూర్తి అయితే సమస్య వచ్చేది కాదు: ఆ తర్వాత కూడా పోలవరం ప్రాజెక్టులో అనేక లోపాలు తలెత్తాయి. 2022 జూన్‌లో వచ్చిన వరద.. నిర్మాణం పూర్తికాని దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా ప్రధాన డ్యాం వద్దకు వెళ్లి ముంచెత్తింది. దిగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తిచేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. వరదల సమయంలోనూ ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసే వీలుండేది. ఈ విషయంలో రాష్ట్ర జలవనరుల శాఖను, పోలవరం అధికారులను P.P.A తప్పుబట్టింది. గుత్తేదారు ఏజెన్సీ, రాష్ట్ర జలవనరులశాఖ సరైన నిర్మాణ ప్రణాళిక అమలు చేయకపోవడం వల్ల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని... 2022 జులై 22న రాసిన లేఖలో P.P.A కార్యదర్శి రఘురామ్‌ కుండబద్దలు కొట్టారు. కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం, P.P.A సూచిస్తున్న మార్గదర్శకాలను కూడా రాష్ట్ర జలవనరులశాఖ పాటించడం లేదని ఆక్షేపించారు. కేంద్ర ఏజెన్సీలు ఎంతగా హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతోందని ఘాటుగా స్పందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.