పార్టీ జెండాలు ప్రదర్శించిన వైకాపా నేతలు.. రైతుల మహా పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత - Tension
Tension in Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు జిల్లాలో రైతులు పాదయాత్ర చేస్తుండగా.. వైకాపా నాయకులు రైతులకు వైకాపా పార్టీ జెండాలు ప్రదర్శించారు. దీంతో రైతులు, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
![పార్టీ జెండాలు ప్రదర్శించిన వైకాపా నేతలు.. రైతుల మహా పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16505880-916-16505880-1664447610058.jpg?imwidth=3840)
Tension in Padayatra in Eluru District : ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో రైతులు మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్ర ఈ రోజు ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలానికి చేరుకుంది. దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామస్థులు రైతులను అహ్వానించారు. అయితే గ్రామంలోని వెకాపా మండల కన్వీనర్ కామిరెడ్డి నాని నివాసం ఇంటికి రాగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మండల కన్వీనర్ ఇంటి దగ్గర రైతులు, వైకాపా నాయకులు.. వైకాపా పార్టీ జెండాలు ప్రదర్శించారు. దీంతో కామిరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సర్ది చెప్పటంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం రైతుల పాదయాత్ర అక్కడి నుంచి ముందుకు సాగింది.
ఇవీ చదవండి: