ETV Bharat / state

Nara Lokesh Rachabanda With Musunuru Villagers: "జగన్ నొక్కే బటన్‌కు కరెంట్ లేదు.. అందుకే డబ్బులు పడవు" - Yuvagalam padayatra Reached 2600

Nara Lokesh Rachabanda With Musunuru Villagers: అప్పు చేసి పేదలకు డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటూ, పన్నుల రూపేణా రెట్టింపు దండుకోవడమా సంక్షేమ పాలన అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా ముసునూరు గ్రామస్థులతో లోకేశ్​ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

Nara Lokesh Rachabanda WithNara_Lokesh_Rachabanda_With_Musunuru_Villagers Musunuru Villagers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 3:43 PM IST

Updated : Aug 27, 2023, 6:25 AM IST

Nara Lokesh Rachabanda With Musunuru Villagers: జగన్ నొక్కే బటన్​కు కరెంట్ లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. కరెంట్ లేని బటన్ ఎన్ని సార్లు నొక్కినా డబ్బులు పడవంటూ ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా ముసునూరు గ్రామస్థులతో లోకేశ్​ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అప్పు చేసి పేదలకు డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటూ, పన్నులు రూపేణా రెట్టింపు దండుకోవడమా సంక్షేమ పాలన అని ప్రశ్నించారు. ప్రజల జేబులకు చిల్లు ఎలా పొడవాలని చూసే పెత్తందారు సైకో జగన్ అంటూ లోకేశ్​ ధ్వజమెత్తారు.

Lokesh Promised to Link Mango Crop With MGNREGS: మామిడి పంటను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం..! నారా లోకేశ్

Nara Lokesh Comments on YCP Government: వైసీపీ పాలనలో అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రమంతా చీకట్లు అలముకున్నాయన్న ఆయన.. వ్యవసాయానికి, పరిశ్రమలకు కరెంటు కోతలు శాపంగా మారాయన్నారు. సైకో సీఎం చర్యలతో ఏపీ పరువు పోయిందని అన్నారు. నూజివీడు ఎమ్మెల్యే కొడుకు మహాకేటు అని.. ఎక్కడ చూసిన భూ కబ్జాలు, మట్టి దోపిడీనే అని ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు అనివార్యమని అన్నారు. పోలీసులు,.. నోటీసుల పేరుతో లవ్ లెటర్లు తెస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదే పోలీసులకు గంజాయి స్మగ్లర్లు, తెలుగుదేశం నేతలపై దాడులు చేసేవారు కనిపించరా అని నిలదీశారు.

Lokesh selfie at PattiSeema Project : పట్టిసీమతో కృష్ణాడెల్టా రైతుల నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు చంద్రబాబు: లోకేశ్

Nara Lokesh Fires on CM Jagan: రోజుకు 3 కోట్ల ఇసుక తినే ఇసుకాసురుడు జగన్మోహన్ రెడ్డి అని లోకేశ్​ ఆరోపించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండా సర్పంచ్​లను ఉత్సవ విగ్రహాల్లా మార్చారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అసలు లబ్ధిదారులను అధికార పార్టీ మోసం చేసిందని ఆవేదన చెందారు. రైతులకు 9 గంటలు ఉచిత కరెంటు సరఫరా చేయట్లేదని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంచాయతీల్లోని పీడబ్ల్యూఎస్ మోటార్లకు 24 గంటలు కరెంటు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్​కు ముసునూరు గ్రామస్థులు విన్నవించారు.

Nara Lokesh Public Meeting in Gannavaram: "ఇసుక దందాలో జగన్‌ రోజూ రూ. 3 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు"

Grand Welcome to Nara Lokesh in Pothireddypalli: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర అడుగడునా ఘన స్వాగతాల మధ్య కొనసాగుతోంది. ఈరోజు నారా లోకేశ్​-బ్రాహ్మణిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా యువగళం వాలంటీర్లు, తెలుగుదేశం శ్రేణులు కేక్ కట్ చేయించారు. పోతిరెడ్డిపల్లిలో అరిసెలతో తయారు చేసిన గజమాలతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని పోతిరెడ్డిపల్లి గ్రామస్థులు లోకేశ్​ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్​కు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ తాగు, సాగునీటి ప్రాజెక్టులపై లేదని నారా లోకేశ్​ మండిపడ్డారు.

Lokesh Yuvagalam Padayatra: 'గన్నవరం గడ్డ - తెలుగుదేశం అడ్డా'.. జనసందోహంతో దుమ్మురేపుతున్న లోకేశ్ పాదయాత్ర..

టీడీపీ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులపై 68వేల 294కోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగోవంతు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చింతలపూడి ప్రాజెక్టు, పిట్టలవారిపాలెం వద్ద ఎత్తిపోతల నిర్మిస్తామని తెలిపారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని లోకేశ్​ స్పష్టం చేశారు.

Lokesh With BC Community Leaders: టీడీపీ హయాంలోనే బీసీ కులాల అభివృద్ధి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక నిధి: లోకేశ్​

Yuvagalam padayatra Reached 2600 Kilo Meters: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర 2వేల 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. యువగళం నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం ముసునూరు మండ‌లం సింహాద్రిపురం గ్రామం వ‌ద్ద 2600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. టీడీపీ స‌ర్కారు వ‌చ్చిన రెండేళ్లలో చింత‌ల‌పూడి లిఫ్ట్ పూర్తి చేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు నీరందిస్తాన‌ని హామీ ఇస్తూ నారా లోకేశ్​ శిలాఫ‌ల‌కం ఆవిష్కరించారు.

Nara Lokesh Yuvagalam Padayatra In Old Krishna Dist: కిక్కిరిసిన బెజవాడ సర్కిళ్లు.. దమ్ము చూపెట్టిన యువగళం పాదయాత్ర..

Last Updated : Aug 27, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.