Kadiyadda Blast:పేలుడు సంభవించి కూలిన కార్మాగారం. దానిని చూస్తే పూర్తిగా కాలిపోయి, బూడిద మాత్రమే మిగిలి కనిపించే దృశ్యాలు. పచ్చని పంట చేలో ఉన్న కార్మాగారం పేలుడు ధాటీకి ఎర్రటి నెత్తుటి మరకలు. కార్మాగారంలో ప్రమాదం సంభవించినప్పుడు పని చేస్తున్న కార్మికుల మృతదేహల మాంసం ముద్దలు. కూలిన గోడలు, మిగిలిన గోడల అవశేషాలు. ఇవి కార్మాగారాలు పేలినపుడు అక్కడ కనిపించిన దృశ్యాలు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామ శివారులో బాణసంచా పేలుడు మిగిల్చిన విషాదం. కడియద్ద పక్కా పల్లెటూరు. రాత్రి 8గంటకే ఊరంతా నిద్రలోకి జారుకుంటుంది. సరిగ్గా అదే సమయంలోఈనెల10న పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఊరంతా భీతిల్లింది. ఏం జరిగిందని ఇళ్లబయటకు వచ్చి చూస్తే.. దూరంగా ఉన్న రేకుల షెడ్డు ధ్వంసమై పొగలు వస్తున్నాయి.
"ఊరి శివారులోనే కుంపటి పెట్టుకుని పడుకుంటున్నామని గ్రామస్థులు అప్పటికిగానీ గ్రహించలేకపోయారు.మంటలు ఎక్కువగా చెల రేగటంతో భయమేసింది. చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఇబ్బంది పడ్డారు. మంటలు, శబ్దం సినిమాలో చూసిన విధంగా వ్యాపించాయి. దీంతో చాలా భయపడి పోయాము." -కడియద్ద గ్రామస్థురాలు
"ఇంట్లో ఉన్న మాకు భారీ శబ్దం వినిపించింది. ఇళ్లు కూలిపోతుందేమో అనే రీతిలో శబ్దం వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్లం భయంతో బయటకు పరుగులు తీశాము. ఎంటీ పరిస్థితి అని బయట చూసే సరికి మంటలు కనిపించాయి. ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లు మొత్తం ఊగిపోయింది. అందరీ ఇళ్ల పరిస్థితి ఇలానే మారింది." -కడియద్ద గ్రామస్థురాలు
తాడేపల్లిగూడేనికి చెందిన అన్నవరం అనే వ్యక్తి బాణసంచా కేంద్రాన్ని నాలుగేళ్లగా నిర్వహిస్తున్నారు. పేలుడు ప్రమాదానికి మాంసపు ముద్దల్లా మిగిలిన వారంతా నిరుపేదలే. మృతిచెందిన ముగ్గురూ కాకినాడ జిల్లా జె.కొత్తూరు నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కూలీలే. బాణసంచా ఆర్డర్‌ను బట్టి ఇక్కడ కూలీలుంటారు. దీపావళి ముందు ఎక్కువ మంది ఉంటారు. వీళ్లతో పనిచేయించుకోవడం తప్ప వాళ్ల భద్రత పట్టించుకోరు. బాణసంచా ప్రాసెసింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవు. పైగా మోతాదుకు మించి మందుగుండు సామాగ్రి వినియోగించడం తయారు చేసినవాటిని అక్కడే నిల్వచేయడం కూడా ప్రమాద తీవ్రతకు కారణంగాపోలీసులు
తేల్చారు.
"ఈ ఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన పై మా విచారణ కొనసాగుతోంది. నిర్వాకుని నిర్లక్ష్యం వల్ల, భద్రత చర్యల లోపం వల్ల జరిగిందని భావిస్తున్నాము. ఫోరేన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ఘటన వివరాలు తెలిసే అవకాశం ఉంది. జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటాం." -ఏవీ సుబ్బరాజు పోలీస్ అధికారి
బాణసంచా కేంద్ర నిర్వాహకుడు పరారీలో ఉండగా.. ఫ్యాక్టరీలో పని కోసం వెళ్లి చనిపోయిన మృతుల కుటుంబాల్లో చీకట్లు అలముకున్నాయి.
ఇవీ చదవండి: