ETV Bharat / state

Dalits Questioned to MP and MLA : ఎంపీ, ఎమ్మెల్యేను నిలదీసిన దళితులు.. ఏముఖం పెట్టుకుని తిరుగుతారని..! - Ganapavaram News

Dalits Questioned to MP and MLA : ఏలూరు జిల్లాలో.. ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులకు దళితుల నుంచి నిరసన సెగ తగిలింది. అక్రమ కట్టడాలంటూ ప్రజావేదిక కూలిస్తే తప్పు లేదు కానీ భవనాలు దెబ్బతింటే ఏమవుతుంది అని నిలదీశారు. అనంతరం దళిత సంఘం పెద్దలను, మరో యువకుడిని ఎంపీ తనతో పాటు కారులో తీసుకెళ్లారు. అసలేం జరిగిందో తెలుసా?

Dalits_Questioned_to_MP_and-MLA
Dalits_Questioned_to_MP_and_MLA
author img

By

Published : Aug 16, 2023, 12:28 PM IST

Dalits_Questioned_to_MP_and_MLA : ఎంపీ, ఎమ్మెల్యేను నిలదీసిన దళితులు..

Dalits Blocked MP and MLA in Eluru District : ఏలూరు జిల్లా గణపవరం మండలం ముప్పర్తిపాడులో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులకు స్థానిక దళితుల నుంచి మంగళవారం నిరసన సెగ తగిలింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యే ఎదుట దళితులు బైఠాయించారు. స్థానిక చెరువును అధికారులు, నాయకులు చెప్పిన ప్రకారం తమకు అప్పగించే వరకు ప్రారంభోత్సవాలను చేయనివ్వబోమని తెగేసి చెప్పారు.

ఈ సమయంలో ముప్పర్తిపాడు సర్పంచి కర్రి రాధాలక్ష్మి భర్త కర్రి శ్రీనివాసరెడ్డి కల్పించుకోబోగా ఆయనను గట్టిగా ప్రశ్నించారు. అక్కడే ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే కల్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. శ్రీనివాసరెడ్డి తమకిచ్చిన హామీని పక్కనబెట్టి దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఎంపీ, ఎమ్మెల్యేల ఎదుటే దళిత సంఘాల పెద్దలు ఆరోపించారు.

Protest against MLA: 'రోడ్లు వస్తున్నాయి.. దారిలో ఉన్నాయి'.. మహిళలతో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే తీరు

Dalits Who Deposed MP and MLA : చెరువు పేరు ఎత్తగానే బూతులు, కులం పేరుతో శ్రీనివాసరెడ్డి దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని కాలనీలో తిరుగుతారో చూస్తామంటూ పెద్దలు అనడంతో ఎంపీ కల్పించుకుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం దళిత సంఘం పెద్దలను, మరో యువకుడిని ఎంపీ తనతో పాటు కారులో తీసుకెళ్లారు.

అసలు వివాదమిదీ..!
Dalits sit in Front of MP MLA : ముప్పర్తిపాడు గ్రామంలో హరిజనపేట చెరువు సమీపంలో జగనన్న ఇళ్ల స్థలాలకు దారి కోసం ప్రభుత్వం చెరువుకు పడమర వైపున సుమారు 25 సెంట్ల భూమిని తీసుకున్నారు. అంతే భూమిని దక్షిణం వైపు ఇచ్చి చెరువును తవ్వుతామని సుమారు నాలుగేళ్ల కిందట ఎంపీడీవో, కార్యదర్శి, ప్రస్తుత సర్పంచి భర్త కర్రి శ్రీనివాసరెడ్డిలు దళిత సంఘ పెద్దలకు హామీ ఇచ్చారు. కానీ దానిని విస్మరించి, ఆ ప్రాంతంలో సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్ క్లినిక్​ను నిర్మించారు.

మూడేళ్లలో ఏం చేశారు..? వైకాపా ఎమ్మెల్యే నిలదీత

Dalit Protest in Eluru District : వీటి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ దళితుల చెరువుకు చెందిన భూమిని ఇవ్వకపోగా, చెరువును నిరుపయోగంగా వదిలేశారు. తమ చెరువు కోసం గత రెండు సంవత్సరాల నుంచి దళితులంతా ఏకమై అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మంగళవారం ఆందోళనకు దిగారు. దళితులు అడిగిన విధంగా చేస్తే నిర్మించిన భవనాల గోడ వరకు వరద వస్తుందని.. అదేవిధంగా భవనాలు దెబ్బతింటాయని, అధికారులు వాదిస్తున్నారు.

అక్రమ కట్టడమంటూ ప్రజావేదికను కూలిస్తే తప్పు లేదు కానీ భవనాలు దెబ్బతింటే ఏమవుతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయినా భవనాలు నిర్మించే సమయంలో చెరువు వరద ఎక్కడ వరకు వస్తుందో అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తెలియదా అంటూ విమర్శిస్తున్నారు. దీనిపై ఎంపీ శ్రీధర్‌ స్పందిస్తూ..సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

'మా ఎంపీని పార్లమెంట్​ నుంచి బర్తరఫ్ చేయండి'

Villagers Fire on Minister: 'నన్ను కాదు.. మీ ఎమ్మెల్యేను అడగండి..' ప్రజలకు మంత్రి సమాధానం

Police Fire on JAC Leaders: 'మేడంకు సమస్యలు ఎప్పుడు చెప్పాలో తెలీదా..ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.