ETV Bharat / state

తీగ లాగితే.. అధికార పార్టీ నేతల డొంక కదులుతోంది - Eluru

Eluru Municipal Corporation: ఏలూరు నగరపాలక సంస్థ అవినీతి చిట్టా బట్టబయలవుతోంది. అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటున్న ఏలూరు నగరపాలక సంస్థ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఉద్యోగుల విలీన ప్రక్రియలో అధికార పార్టీ నాయకులతో పాటు.. జిల్లా స్థాయి అధికారి కుమ్మక్కై ఉద్యోగాలు పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Eluru Municipal Corporation
మున్సిపాలిటీ
author img

By

Published : Mar 24, 2023, 7:49 PM IST

ఏలూరు నగరపాలక సంస్థలో కుంభకోణం

Corruption in Eluru Municipal Corporation: అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటున్న ఏలూరు నగరపాలక సంస్థ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. నగరపాలక సంస్థలో విలీనం చేసిన పంచాయతీ సిబ్బందిని.. వారికే తెలియకుండా తొలగించిన అధికారులు... వారి స్థానంలో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని చేర్చుకున్నారు. దీనికోసం భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

తీగలాగితే డొంక కదిలిన చందంగా... ఏలూరు నగరపాలక సంస్థ అవినీతి చిట్టా బట్టబయలవుతోంది. గతేడాది ఏలూరు సమీపంలోని 7 గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి. వెంకటాపురం, శనివారపుపేట, సత్రంపాడు, చొదిమెళ్ల, తంగెళ్లమూడి, కొమడవోలు, పోణంగి పంచాయతీలు విలీనం కాగా... ఆయా పంచాయతీల్లో వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బందిని 2021లో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. విలీన పంచాయతీలకు సంబంధించి 430 మంది ఉద్యోగులు ఉండగా... వారిలో అన్ని అర్హతలు ఉన్నా సుమారు 66 మందిని అకారణంగా విధుల నుంచి తొలగించారు. వీరి స్థానంలో అధికార పార్టీ నాయకుల అనుయాయులకు, అధికారులకు నచ్చిన వారితో భర్తీ చేసేశారు. తమను విధుల నుంచి ఎందుకు తొలగించారో తెలియక అధికారులు, కార్పొరేషన్‌ల చుట్టూ ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మభ్యపెట్టి.... పనితీరు సరిగా లేని కారణంగా విధుల నుంచి తొలగించామంటూ చావుకబురు చల్లగా చెప్పారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల్లో 66 మందిని తొలగించటంతో పాటు... కార్పొరేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవసరమంటూ... మరో ఏడుగురు కొత్త వారిని ఎంపిక చేశారు. వాస్తవానికి కార్పొరేషన్‌లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ఆప్కాస్... ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సంస్థకు పంపించలేదు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, అభ్యర్థుల ఎంపిక... వంటివి లేకుండానే... కొత్త వారిని విధుల్లోకి తీసుకున్నారు. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన వారి పేర్లను పంచాయతీలో పని చేసిన నిజమైన ఉద్యోగుల జాబితాలో చేర్చారు. ఉద్యోగాల్లోంచి తీసేసిన వారి పేర్లను తీసివేసి... కార్పొరేషన్ ఉద్యోగులు, పంచాయతీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చినట్లు మాయ చేస్తున్నారు.

ఉద్యోగుల విలీన ప్రక్రియలో అధికార పార్టీ నాయకులతో పాటు.... జిల్లా స్థాయి అధికారి కుమ్మక్కై ఉద్యోగాలు పంచుకున్నట్లున్నారు. అక్రమంగా ఉద్యోగం పొందిన వారి నుంచి అధికారులు అవినీతికి పాల్పడ్డారు. కార్పొరేషన్‌లో అవినీతి అక్రమాలపై మేయర్, కార్పొరేటర్లు సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమ వద్దకు వచ్చినావరికి.. మీ ఉద్యోగాలు మీకు వస్తాయంటూ ఇంకా వారిని నమ్మిస్తూ... వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. -బడేటి రాధాకృష్ణ, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.