TABS ISSUE : ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం 5 లక్షల 18 వేల ట్యాబ్‌లు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్-A.P.T.S... టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. న్యాయ సమీక్ష సమయంలో అనేక సంస్థలు ప్రభుత్వ నిబంధనపై ప్రశ్నలు లేవనెత్తాయి. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిబంధనలను అనుసరించి చాలా రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన టెండర్లలో... 8 అంగుళాలు, అంతకంటే ఎక్కువ సైజు తెర ఉండాలనే నిబంధన పెట్టినట్లు గుర్తుచేశాయి. S.V.S. టెక్నాలజీ అనే సంస్థ టెండర్ల నిబంధనపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. 8.7 అంగుళాల నిబంధనను 8, అంతకంటే ఎక్కువ అంగుళాలకు మార్చాలని కోరింది. 8.7 అంగుళాల స్క్రీన్ ఒక్క బ్రాండ్‌లోనే లభ్యమవుతుందని వాదించింది.
S.V.S. టెక్నాలజీ సంస్థతో పాటు క్లస్టర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, వారిమస్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, ఏసర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎమిజో సొల్యూషన్స్ సంస్థలూ 8.7 అంగుళాల నిబంధనపై అభ్యంతరం తెలిపాయి. ఎమిజో సొల్యూషన్స్ సంస్థ జాతీయ స్థాయిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని గుర్తుచేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖ నిబంధనలతోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 లక్షల మంది, గుజరాత్‌లో 3 లక్షల మంది, హరియాణాలో 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశామని ఆయా సంస్థలు తెలిపాయి. అక్కడ 8 అంగుళాలు, అంతకంటే ఎక్కువ సైజు ఉండాలనే నిబంధన పెట్టాయని వెల్లడించాయి. 8.7 అంగుళాల తెర ఒక్క శాంసంగ్ బ్రాండ్‌లోనే ఉందని వాదించినా ఫలితం లేకయింది. దాంతో అనేక కంపెనీలు అర్హత కోల్పోవడంతో టెండర్లలో పాల్గొనలేకపోయాయి.
ఇవీ చదవండి: