Central Government is Ready to solve Defects of Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కొత్తగా ఎదురైన సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ విషయంపై ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంలో నిర్మాణ క్రమం, ప్రగతి సరైన మార్గంలో లేవని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కేంద్ర సంస్థలు నిర్మాణ ఏజన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వైపు వేలు చూపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అధికారులు నిర్ణయాల ఆలస్యంపై ప్రశ్నిస్తున్నారు.
Duidebund Constructed without stress on spillway Sagged: స్పిల్‌వేపై ఒత్తిడి లేకుండా నిర్మించిన గైడ్‌బండ్ కూలిపోయింది.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించినా సీపీజే ప్రధాన డ్యాం ప్రాంతాన్ని వరద ముంచేసింది. అంతకుముందు ఎగువ కాఫర్ డ్యాం సరైన సమయంలో పూర్తి చేయకపోవడం వల్ల వరద ధాటికి ప్రధాన డ్యాం ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్ ధ్వంసమైంది. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన డయాఫ్రం వాల్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గైడ్‌బండ్ కుంగిపోయిన అంశంలో బాధ్యులను గుర్తించాలని కేంద్ర మంత్రి ఆదేశించినా ఆ నిర్ణయాలు జరగలేదు.
జాతీయ ప్రాజెక్టులో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లకపోతే ప్రమాదమనే ఆందోళనలతో కేంద్ర జల్‌శక్తి పెద్దలు కార్యాచరణకు నడుం బిగించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్ సారధ్యంలో దీనికి కసరత్తు సాగుతోంది. ఆయన కేంద్రం సంస్థలతో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, వ్యాప్కోస్, సీఎంఎస్‌ఆర్‌ఎస్ వంటి సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరితోను విడి విడిగా మాట్లాడుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.
Polavaram Project Authority is coordinating central and state governments: పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర సంస్థలను సమన్వయం చేస్తోంది. వ్యాప్కోస్ నేరుగా నాణ్యతను పర్యవేక్షిస్తోంది. సీఎంఎస్‌ఆర్‌ఎస్ కట్టడాలకు అవసరమైన పరిశోధనలు చేసి నివేదికలు ఇస్తోంది. నాణ్యత నియంత్రణ సంస్థ ప్రతినిధులు కూడా పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లోనే ఉంటున్నారు. అక్కడ ఇంత పర్యవేక్షణ ఉన్నా ఎందుకు లోపాలు జరుగుతున్నాయనే ప్రధాన ప్రశ్న ఆధారంగా పరిష్కార మార్గాలు వెతికే అన్వేషణ సాగుతోంది. సెప్టెంబరు 10 నాటికి దీనికి పరిష్కారం వస్తుందని భావిస్తున్నారు.
Meeting on Polavaram Guide Bund Collapsed: పోలవరం గైడ్‌బండ్ ఎందుకు కుంగింది..?వాడీవేడీ చర్చ..
Vedire Sriram meeting with State Water Resources Department and Polavaram officials : నివేదిక తయారయ్యేలోపు వెదిరె శ్రీరామ్ రాష్ట్ర జలవనరులశాఖ, పోలవరం అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర సంస్థలు, రాష్ట్ర అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రితో పాటు, కార్యదర్శి, సలహాదారు తదితర ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. పోలవరంలో స్పష్టమైన బాధ్యతల బదలాయింపునకు ఆ సమావేశం కీలకం కానుంది.