ETV Bharat / state

Your Desi Cart: అవసరమే ఆ తల్లీకూతుళ్లను వ్యాపారవేత్తలను చేసింది! - ap news

Your Desi Cart: మన వాళ్లు విదేశాల్లో స్థిరపడినా.. చాలామంది కావాల్సిన వస్తువులు, దుస్తులను ఇక్కడి నుంచే తెప్పించుకుంటారు. దానికి ఎవరో ఒకరు సాయం చేస్తారు. మరి అలా చేయడానికి వాళ్లకు వీలు కాకపోతే... ఇదే సమస్యని ఎదుర్కొంది సత్య ప్రియాంక! అవసరమే సృజనాత్మకతకు ఆధారమని నమ్మే తను దీనికో పరిష్కారాన్నీ కనిపెట్టింది. అదే.. యువర్‌ దేశీకార్ట్‌. తల్లితో కలిసి ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు ఎన్నో దేశాల్లో తెలుగు వారికి సేవలందిస్తోంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..!

your-desi-cart-founders-successfull-story
అవసరమే ఆ తల్లీకూతుళ్లను వ్యాపారవేత్తలను చేసింది!
author img

By

Published : Jan 3, 2022, 8:45 AM IST

Your Desi Cart: మాది రాజమండ్రి. నాన్న వెంకట శ్రీరామ్‌, అమ్మ సత్యధాత్రి. నాన్న ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగా. బీఈ కంప్యూటర్స్‌ చేసి, సింగపూర్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, టెక్సాస్‌ల్లో ఉద్యోగాలు చేశా. మావారు స్రవంత్‌తో కలిసి అమెరికాలో స్థిరపడ్డా. పదేళ్లకుపైగా విదేశాల్లోనే ఉన్నా... ఏం కావాలన్నా అమ్మే పార్శిల్‌ పంపేది. కొన్నాళ్ల క్రితం నేను కొన్నింటిని మన దేశం నుంచి తెప్పించుకోవాలనుకున్నా. అప్పుడు గర్భవతిని. అమ్మ, అత్తగారు ఇద్దరికీ ఆరోగ్యం బాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో ప్రయత్నించా. అప్పుడు తెలిసొచ్చింది.. మిగతావాళ్ల కష్టం. అవసరమే కొత్త సృజనలకు నాంది అని బలంగా నమ్ముతా. ప్రత్యేక కొరియర్‌ సర్వీస్‌ ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మావారూ ఆలోచన బావుందన్నారు. మా అమ్మే సహ వ్యవస్థాపకురాలిగా 2019లో ‘యువర్‌ దేశీ కార్ట్‌’ ప్రారంభమైంది.

మా షిప్పింగ్‌ సర్వీస్‌ గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశా. గంటల్లోనే మొదటి ఆర్డర్‌ వచ్చింది. ఈ వ్యవహారాలన్నీ మూడు నెలలకుపైగా అమ్మ ఇంటి నుంచే కొనసాగించింది. తర్వాత హైదరాబాద్‌లో ఓ గిడ్డంగిని తీసుకున్నాం. ఆపై లాక్‌డౌన్‌. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వాళ్లకి మందులనూ సరఫరా చేశాం. ఆర్డర్లు పెరిగేకొద్దీ సొంత వెబ్‌సైట్‌, యాప్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఈ మొత్తంలో మేము పెట్టిన పెట్టుబడీ ఇదే! దీని ద్వారా పిక్‌అప్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, షిప్పింగ్‌ సేవలను అందిస్తున్నాం. వినియోగదారుడు రిజిస్టర్‌ అయ్యాక తనకో ప్రత్యేక లాకర్‌ ఇస్తాం. ఇంటి దగ్గర్నుంచి పొడులు, పచ్చళ్లు తెప్పించాలి. మేం తెప్పించి లాకర్‌లో పెడతాం. తర్వాత దుస్తులు, టైలరింగ్‌ అవసరముంటుంది. వాటినీ మేమే చూసుకుంటాం. ఆన్‌లైన్‌లో ఏదో కొంటారు. వాటిని పరిశీలించి చెబుతాం. ఇలా.. వాళ్లకు కావాల్సినవన్నీ వచ్చాయి అన్నాక ప్యాక్‌ చేసి, కావాల్సిన చోటికి రవాణా చేస్తాం. ఈక్రమంలో మావాళ్లు ఎప్పటికప్పుడు వినియోగదారుతో మాట్లాడుతూనే ఉంటారు.

ప్రారంభం బాగానే ఉన్నా.. థర్డ్‌పార్టీ కొరియర్‌ వాళ్లు కొందరు ట్రాకింగ్‌ అవకాశం ఇచ్చేవాళ్లు కాదు. పైగా ఖర్చూ ఎక్కువే. దీంతో కొన్ని ఆర్డర్లు వెనక్కి వెళ్లేవి. ఇంకొన్ని సమస్యలూ ఎదురయ్యాయి. ఒక్కోటీ దాటుకుంటూ ముందుకెళుతున్నాం. ఇప్పుడు డీహెచ్‌ఎల్‌ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. దాంతో ఖర్చు తగ్గడంతోపాటు త్వరగా సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు మా ఆప్‌కి 60వేలకిపైగా సబ్‌స్క్రెబర్లు ఉన్నారు. ఉద్యోగంతోపాటే దీన్నీ చూసుకుంటున్నా. పగలు ఉద్యోగం, సాయంత్రం, రాత్రి దీని పనులు. కష్టం కావడం లేదా అంటే... ఇది ఎంతో ప్రేమతో నమ్మకంతో మొదలు పెట్టింది కాబట్టి శ్రమ తెలియడం లేదని చెబుతా. పైగా చాలా కార్యకలాపాలు అమ్మ చూసుకుంటుంది. మొదలు పెట్టినప్పుడు మా పనిమనిషి, ఇంకో ఇద్దరే ఉన్నారు. వాళ్లకి వస్తువులను చెక్‌ చేయడం, వినియోగదారులతో ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలి, ప్యాకింగ్‌ వంటివన్నీ అమ్మే నేర్పింది. కొవిడ్‌ సమయంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన మహిళలకి అవకాశమిచ్చాం. ‘డబ్బులిస్తే ఆరోజుకే పనికొస్తుంది. ఉపాధి చూపితే వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడతారు’ అన్నది అమ్మ ఉద్దేశం. ఈ మధ్యే బరువైన సామాన్లకు సాయం కోసం అబ్బాయిలనీ తీసుకున్నాం. నెలకు 300 వరకూ షిప్‌మెంట్స్‌ చేస్తున్నాం. పండగ నెలల్లో ఇది ఇంకా పెరుగుతుంది. 25కుపైగా దేశాలకు సేవలందించాం. ఇంకా ముందుకు వెళ్లగలుగుతామనే నమ్మకం ఉంది. దానికి తగ్గ ప్రణాళికలూ సిద్ధం చేసుకున్నాం.

ఇదీ చూడండి: Sid Naidu: నాడు పేపర్ బాయ్.. నేడు "పవర్ ఐకాన్"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.