తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కో లు వద్ద ఏలేరు కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ గొడారి గుంట ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఏలేరు రెగ్యులేటరీ వద్ద స్నానానికి దిగారు. ఈ క్రమంలో మహేశ్ అనే యువకుడు నీటిలో గల్లంతు అయ్యాడు. తరచూ ఈ ప్రాంతంలో యువత మద్యం తాగడం, స్నానానికి దిగడం, గల్లంతై ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు తెలిపారు. అయినా యువతలో ఎలాంటి మార్పు రావడం లేదని అన్నారు.
ఇదీ చదవండీ.. Janasena: కార్యకర్తలపై దాడులు చేస్తే నేనే రోడ్లపైకి వస్తా: పవన్ కల్యాణ్