ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా తరఫున తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పార్లమెంటు నుంచి విజయం సాధించిన చింతా అనురాధ, ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి ఎన్నికైన పొన్నాడ వెంకట సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి పల్లెపాలెంలోని వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఇరునేతలు ముమ్మిడివరంలోని కొండాలమ్మ చింత ఆలయం నుంచి పల్లెపాలెంలోని స్వామివారి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మార్గ మధ్యలో దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్రలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
పల్లెపాలెం వెంకన్నను దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే - chintha anuradha
ఎన్నికల్లో విజయం సాధించినందున వైకాపా నేతలు అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ పాదయాత్ర చేపట్టి పల్లెపాలెంలోని వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.