తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలానికి చెందిన వైకాపా నాయకులు మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా కండువాలు కప్పి ఆమె వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో తెదేపాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానంలో వర్చువల్ లోక్ అదాలత్