ETV Bharat / state

జగన్ జైలుకెళ్లటం ఖాయం:తెదేపా నేత యనమల

జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ జైలుకు వెళ్లటం ఖాయమని వ్యాఖ్యానించారు.

yanamala comments on CBI verdict on cm jagan case
author img

By

Published : Nov 1, 2019, 1:18 PM IST

జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు తీర్పుపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. జగన్ జైలుకు ఎప్పుడు వెళ్తారా అని ఆ పార్టీ నాయకులే ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కోర్టు విచారణకు వెళ్తే రూ.60 లక్షలు ఖర్చవుతాయని చెప్పడం విడ్డూరమన్నారు. వ్యక్తిగత కేసుకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.

జగన్ జైలుకెళ్లటం ఖాయం:తెదేపా నేత యనమల
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంజగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని యనమల విమర్శించారు. ఇసుక కొరతతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆత్మహత్యలపై వైకాపా నాయకులు హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సింగపూర్ కన్సార్టియం ఎందుకు రద్దుచేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు.

ఇదీ చదవండి : జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్​ కొట్టివేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.