ETV Bharat / state

ఘనంగా శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం

యానాంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యులు.. శిష్య బృందం స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు.

yanam venkanna swamy kalyanam
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
author img

By

Published : Mar 25, 2021, 3:57 PM IST

యానాంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యులు.. శిష్య బృందం స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున.. స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి మంగళ సూత్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం అధ్యక్షులు కాపు గంటి ఉమాశంకర్ దంపతులు.. మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ దంపతులు సమర్పించారు.

యానాంలో ఎన్నికలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా... భక్తులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. కళ్యాణం అనంతరం వారికి నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. యానాంలోని రెడ్డి రాజుల కాలంలో ప్రతిష్టించబడిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. మీసాల వెంకన్నగా.. చద్దుకూడు వెంకన్నగా పరిసర గ్రామ జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలు స్వామివారిని పిలుచుకుంటారు.

ఇదీ చదవండి:

వారికోసం మొదటిసారి పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.