రెండు వందలు పెట్టి చేపలు కొంటే ఇంటిల్లిపాది తినేయొచ్చు అనుకుంటాం కానీ.. ఒక్క చేప ధర ఇరవై వేలు పలికిందంటే మాటలా..? కానీ.. ఇది నిజంగా జరిగింది. ధర ఎక్కువైనా.. తగ్గేదేలే అంటూ.. రేటుకు వెనకాడకుండా కొనడానికి పులస ప్రేమికులు సై అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానంకు ఆనుకుని ప్రవహించే గౌతమి గోదావరిలో వరదల సందర్భంలో సముద్రం నుంచి.. పులస జాతికి చెందిన చేపలు వరద నీటికి ఎదురీదుకుంటూ ధవళేశ్వరం వరకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు వేసిన ప్రత్యేక వలలకు చిక్కుకుంటున్నాయి.
పదేళ్ల క్రితం ఈ సీజన్లో ఒకరోజు 100 నుండి 200 వరకు చేపలు మార్కెట్లోకి వచ్చేవని.. ఒక్కో చేప 1000 నుంచి 2000 వరకు ధర పలికేదని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం ముఖద్వారాల వద్ద చమురు సంస్థల కార్యకలాపాలు ఎక్కువ కావడంతో గోదావరి నదీ పాయలలోకి చేపలు రావటం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందని.. ఈ ప్రభావం చేపల ధరలపై పడుతుందని చెప్పారు. అందుకు తగ్గట్టే.. సోమవారం సాయంత్రం యానాం మార్కెట్లో ఒక పులస చేప 20 వేల రూపాయలు ధర పలికి రికార్డు సృష్టించింది. ఓ మహిళ.. ఈ చేపను ఇష్టంగా భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: