రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి చేయూత పథకం ద్వారా మహిళల ఖాతాల్లో గతేడాది డబ్బు జమ చేశారు. మరో దఫా డబ్బులు జమ చేయనున్నారు. ఈ ఏడాది కచ్చితంగా ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెల్లవారుజామునుంచే మహిళలు ఈ సేవా కేంద్రం ముందు బారులు తీరారు. జగ్గంపేట మొత్తం ఒకటే ఈ సేవా కేంద్రం ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా వేళ భౌతికదూరం పాటించకపోవడంతో వ్యాధి ప్రబలే ప్రమాదముందని.. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: జగ్గంపేట సీహెచ్‌సీకి ఆక్సిజన్ పరికరాలు అందజేత