తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన అనసూయ అనే వివాహితను కళాశాల సిబ్బంది కాపాడారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన అనసూయ.. విశాఖ జిల్లా రావికమతం గ్రామానికి చెందిన శివను ప్రేమవివాహం చేసుకుంది. కొంతకాలంగా ఆమెకు, శివకు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. అధ్యాపకుడిగా పనిచేస్తున్న శివను చూడాలని ఆమె యాజమాన్యాన్ని అడిగింది. వారి నుంచి సరైన సమాధానం లేకపోవటంతో బలవన్మరణ ప్రయత్నం చేసింది.
ఇవీ చదవండి..