ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య.. గ్రామ వాలంటీరుపై ఆరోపణలు - rajamahendhravaram

తూర్పు గోదావరి జిల్లా పల్లం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత గోదావరి ఉప్పుటేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామ వాలంటీరు వేధింపులకు తాళలేకే తన భార్య ఆత్మహత్య చేసుకుందని మృతురాలి భర్త ఆరోపిస్తున్నారు.

వాలంటీరు వేధింపులకు వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Sep 24, 2019, 8:48 PM IST

గ్రామ వాలంటీరు వేధింపులకు వివాహిత ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వీరవేణి అనే మహిళ ఉప్పుటేరు వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న పాలెపు మాధవ వర్మ వేధిస్తున్నాడంటూ.. 2 రోజుల క్రితం గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. అనంతరం నిందితుడి, బాధిత కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. మనస్థాపానికి గురయ్యిన వీరవేణి సమీప గోదావరి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి శవ పంచనామా నిర్వహించారు. గతంలోనూ మాధవ వర్మ పలువురు మహిళలను వేధించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ముమ్మిడివరం ఎస్​ఐ రాజశేఖర్ తెలిపారు.

ఇదీ చూడండి:

పెన్నా నదిలో విద్యార్థి శవం...ఆ ఇద్దరిలో ఒకరిదే

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_Atp_46_11_Poling_Start_AV_C8

Body:అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలు పని కేంద్రాల్లో తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఓటర్లు వరుసలలో నిల్చున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ల ఆసక్తి చూపుతున్నారు. పట్టణ పరిధిలోని 67, 80 ఎన్ పి కుంట మండలం పరిధి లోని 197 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.