Woman Committed to Suicide Attempt Died: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లీకుమారులలో.. తల్లి కామాక్షి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కామాక్షి కుమారుడు మురళీకృష్ణ పరిస్థితి విషమంగానే ఉంది. వైకాపా నాయకుల వేధింపుల వల్లే చనిపోతున్నామని.. తల్లికుమారులు సెల్ఫీ వీడియో విడుదల చేసిన పోలీసులు ఎందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
"ఆత్మహత్యాయత్నం చేసిన తల్లికుమారులు ఇద్దరూ.. ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోలో ఎవరెవరు వేధిస్తున్నారో స్పష్టంగా చెప్పినప్పటికీ.. పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం శోచనీయం. శాసనసభ్యుడి వల్ల పోలీసులు వేధింపులకు పాల్పడిన వారిని రక్షిస్తున్నారని స్పష్టం అవుతోంది." -నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఇది జరిగింది: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బలభద్రపురంలో తమ ఇంటిని కూల్చివేశారని.. 20 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదంటూ బాధితులు కామాక్షి, మురళికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ చావుకు వైకాపా నేతలు దుర్గారావు, అప్పారావు, భీమన్న వీర్రాజు కారణమంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అచేతన స్థితిలో పడి ఉన్న బాధితులను స్థానికులు అనపర్తి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు
ఇవీ చదవండి: