తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట సెజ్ ప్రాంతంలో ఉన్న రొయ్యల పరిశ్రమలో పని చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన పూజా కుభార్ అనే ఇరవై ఒక్క ఏళ్ల యువతి గత మూడు నెలలుగా సంధ్య ఆక్వా కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తోంది. ఏమైందో ఏమో గానీ మంగళవారం రాత్రి తానుంటున్న డాబా పై ఉన్న స్తంభానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కొత్తపల్లి పోలీసులు పరిశ్రమకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ పరిశ్రమలో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు మూడొందల మంది మహిళలు పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై అబ్దుల్ నబీ తెలిపారు.
ఇదీ చదవండి: శాంతించిన గోదారమ్మ... ముంపు నుంచి బయటపడిన కాజ్వే