కూతురు తల్లి అయిందన్న ఆనందం ఆ అమ్మనాన్నలకు ఎంతసేపో నిలువలేదు.. అంతలోనే కన్నకూతురు, మనుమడు కూడా తమను వీడి వెళ్లి పోయారన్న చేదు నిజం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు బోరున విలపించి కుప్పకూలిపోయారు. ఈ విషాదకర సంఘటన పెద్దాపురంలోని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం జరిగింది. పట్టణ శివారు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బాసిన భద్రరావు, నాగేశ్వరి దంపతుల కుమార్తె చింతలపూడి పూజిత(22)ను రెండ్రోజుల క్రితం ప్రసవం కోసం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా.. ఇంతలో ఆకస్మికంగా నొప్పులు వచ్చి మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన అరగంటలోనే బిడ్డ మరణించడంతో బంధువులు శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు. అక్కడికి గంట వ్యవధిలో తల్లికూడా మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. సకాలంలో సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లే తల్లీబిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ ప్రధాన వైద్యుడి ఛాంబరు వద్ద ఆందోళన చేశారు.
ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వల్లే..
తల్లీబిడ్డ మృతిపై ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి వర్మను వివరణ కోరగా.. గర్భిణికి ఆసుపత్రిలో గురువారం స్కానింగ్ తీయగా బిడ్డ రెండు కిలోల బరువుతో పాటు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉంది. శుక్రవారం శస్త్రచికిత్స చేస్తామని తల్లిదండ్రులకు చెప్ఫి. సమస్య పరిష్కారానికి గురువారం రాత్రి మందులు ఇవ్వమని సిబ్బందికి చెప్ఫా ఆ మేరకు సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చారు. బిడ్డ మృతి చెందిన కొద్ది సేపటికి తల్లి మరణించడానికి పలమనరీ ఎంబాలిజం కండిషన్ కారణమన్నారు.
ఇదీ చూడండి. రఫేల్ ప్రాజెక్టులో భాగం పంచుకోనున్న నెల్లూరు కంపెనీలు