తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో విషాదం జరిగింది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ర్యాలీ గ్రామానికి చెందిన దంతలూరి అనూష, గణేష్ 14 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా భర్త వేధింపులు ఎక్కువయ్యాయని.. తట్టుకోలేకే అనూష ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆర్వో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: జ్యోతుల నెహ్రూ