ETV Bharat / state

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య - ముమ్మిడివరంలో భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేసి ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసి... ఓ ఇల్లాలు పోలీసులకు చిక్కిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఏలియా సాగర్ తెలిపారు.

wife kills husband for getting close to her boyfriend in east godavari district
ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : Oct 3, 2020, 10:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలానికి చెందిన వంగలపూడి సుబ్బారావు వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో దుర్గ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే దుర్గ అదే గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించి... సెప్టెంబర్ 29న అతను తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. భర్త సృహకోల్పోయిన తర్వాత ప్రియుడు ప్రసాద్, అతని స్నేహితుడి సహకారంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తెల్లవారుజామున మృతదేహాన్ని అతను పనిచేసే వెల్డింగ్ వర్క్ దగ్గర ఉంచి విద్యుత్ ప్రసారం చేసి కరెంట్ షాక్ తో మరణించినట్లు చిత్రీకరించారు. మొదటి భార్య కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి శవపరీక్ష నిర్వహించారు.

శవపరీక్ష నివేదికలో అసలు విషయం బయట పడడంతో హత్యకేసుగా మార్చి దర్యాప్తు చేయగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెండో భార్య దుర్గతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ ఏలియా సాగర్ తెలిపారు.

ఇదీ చదవండి:

రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.