కేంద్రపాలిత ప్రాంతం యానాంలో 7 నెలల అనంతరం వారపు సంత నిర్వహించారు. కరోనా కారణంగా ఇన్నాళ్లు సంత జరగలేదు. ప్రస్తుతం అధికారుల సూచనలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతను ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు తోపుడుబండ్ల వద్ద, దుకాణాల వద్ద అధిక ధరలకు సరకులు కొన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే వర్షం కారణంగా సంతకు ఆటంకం ఏర్పడింది. వ్యాపారులు టార్పాలిన్ పట్టాలు వేసుకుని సంత నిర్వహించారు. వానల వల్ల వ్యాపారం సరిగ్గా జరగట్లేదని వారు అంటున్నారు. మరోపక్క ఉల్లిపాయలు, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ ఉల్లి రూ. 80 నుంచి రూ.100 పలుకుతోంది.
ఇవీ చదవండి..