తూర్పు గోదావరి జిల్లాలోని కొవిడ్-19 ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు గాను వైద్యులను నియమించే చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన కమిటీ సభ్యులు వైద్యుల నియామకానికి ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి బి.సత్యసుశీల, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.రాఘవేంద్రరావు, రాజమహేంద్రవరం డీసీహెచ్‌ఎస్ రమేశ్‌కిషోర్, రంగరాయ వైద్యకళాశాల ప్రిన్సిపల్ బాబ్జి హాజరయ్యారు.
ముఖాముఖికి ఒక వైద్యుడు (ఎనస్తీషియన్) మాత్రమే హాజరయ్యారు. ఒప్పంద విధానంలో ఏడాది పాటు సేవలందించేందుకు నియమించారు. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. అవసరమైతే ఐఎంఏ గుర్తింపు పొందిన ఎనస్తీషియన్, జనరల్ మెడిసిన్, పల్మనాలజిస్టు విభాగాలకు చెందిన వైద్యుల సేవలను వినియోగించుకుంటామన్నారు.
ఇదీ చదవండి: