తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్త పాకలలో దివీస్ ఫార్మా పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గురువారం తాటియాకులపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు.
దివీస్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని గతంలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని మధు కోరారు. లేదంటే కలెక్టరేట్ ముట్టడితో పాటు నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే కాకినాడ ఎస్ఈజెడ్ను రద్దు చేసి రైతుల భూమిని తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభకు రైతు సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి