వైకాపా నాయకులు చెప్పిన విధంగా అవినీతికి పాల్పడనందుకు.. తనను ఉద్యోగం నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఓ మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు.. చిన శంకర్లపూడి గ్రామానికి చెందిన దయామణి గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది. గత కొద్ది రోజులుగా అక్రమ వసూలు చేయాలని వైకాపా నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె అంటోంది. వారు చెప్పినట్లు వినకపోయినా.. తెదేపా అభిమాని అయిన తన భర్త పార్టీ మారకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని దయామణి వాపోయింది. ఎంపీడీఓ తనకు ఇప్పటికే షోకాజ్ నోటీసు పంపారని తన ఉద్యోగం పోయినాసరే.. వైకాపా నాయకులు చెప్పినట్లు అవినీతికి మాత్రం పాల్పడనని దయామణి అంటోంది.
ఇదీ చదవండి: సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ