ETV Bharat / state

టీడీపీ నాయకుడి దారుణ హత్య.. ఇంటి వరండాలో మృతదేహం - ఉప సర్పంచ్​ శీని సత్య వరప్రసాద్ హత్య

TDP VICE SARPANCH MURDER : తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ఉపసర్పంచ్​ దారుణ హత్యకు గురైయ్యారు. ని సత్య వరప్రసాద్ (51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

TDP VICE SARPANCH MURDER
TDP VICE SARPANCH MURDER
author img

By

Published : Mar 27, 2023, 11:36 AM IST

TDP VICE SARPANCH MURDER : తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. కొవ్వూరు మండలం వేములూరు, నందమూరు టీడీపీ యూనిట్ ఇన్​ఛార్జి, వేములూరు ఉప సర్పంచ్​ సత్య వరప్రసాద్ (51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై రక్తపు మరకలు, గాయాలు ఉండటంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సత్య వరప్రసాద్ భార్య శ్రీకళ ఉద్యోగం నిమిత్తం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉంటున్నారు. కుమార్తె ఏలూరులో, కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటూ చదువుకుంటున్నారు. సత్య వరప్రసాద్ ఒక్కరే వేములూరులోని సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి పదింటి వరకు చుట్టుపక్కల వారితో మాట్లాడారు. ఆదివారం ఉదయం తిరుమరెడ్డి ఆంజనేయులు, రావిపాటి వెంకట్రావు ఆయన ఇంటికి వెళ్లారు. వరండాలో దుప్పటి కప్పుకొని ఉండటంతో పడుకున్నారని భావించారు. ఎంతా పిలిచినా పలకకపోవడంతో వెళ్లి దుప్పటి తీయగా.. గాయాలతో సత్య వరప్రసాద్ మృతదేహం కనిపించింది. బోర్లా పడి ఉన్న మృతదేహంపై దుస్తుల్లేవు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పట్టణ సీఐ రవికుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎడమ చెవి నుంచి రక్తస్రావం, ఎడమ దవడపై గాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. లోపల గదిలో ఘర్షణకు దిగి, అనంతరం వరండాలోకి తీసుకొచ్చి తలను గోడకేసి కొట్టి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య శ్రీకళ ఫిర్యాదుపై హత్య కేసుగా నమోదు చేశారు.

గొడవలకు వెళ్లని వ్యక్తిగా: తమ కంటే ఊరికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని, ఎందుకు ఇలా జరిగిందో తెలియదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రాత్రి 11 గంటలకు తమతో మాట్లాడారని సత్యప్రసాద్​ పిల్లలు ఆవేదన చెందారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని కొందరు స్థానికులు తెలిపారు. వివాద రహితుడిగా, పార్టీలకు అతీతంగా సత్య వరప్రసాద్​కి గ్రామంలో మంచి పేరుందన్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని తోటి సభ్యులతో కలిసి పలు సందర్భాల్లో బహిరంగంగానే పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అంతకుమించి రాజకీయంగా వివాదాల్లేవని తెలిపారు. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వర్మ తెలిపారు.

హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి: శీని సత్య వరప్రసాద్​ అనుమానస్పదంగా మృతి చెందడం బాధాకరమని టీడీపీ మాజీ మంత్రి జవహర్​ నాయుడు ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు వేగంగా పూర్తి చేసి దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్​ చేశారు. సత్యప్రసాద్​ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని, హోం మంత్రి పరిధిలో శాంతి, భద్రతలు క్షీణించాయని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.