తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించినట్లు పి.గన్నవరం ఎస్ఐ సురేంద్ర వివరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి నుంచి మెటల్ లోడుతో.. మామిడికుదురు మండలం నగరం గ్రామం వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించారు. డ్రైవర్ వాహనం నడుపుతున్న సమయంలో చరవాణిలో మాట్లాడుతున్నట్టు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ వర్ధనపు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని సురేంద్ర వెల్లడించారు.
ఇవీ చూడండి...