యానాంలో స్వచ్ఛంద సేవా సంస్థలు పేదల కడుపు నింపుతున్నాయి. దాతల సహకారంతో సమకూర్చిన 20 లక్షల రూపాయల విలువైన కూరగాయలను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఐదు రకాల కూరగాయలు 5 కేజీల చొప్పున 16 వేల కుటుంబాలకు అందజేశారు. గ్రామాల్లోని స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు ఉదయాన్నే తలుపు తట్టి మరీ కూరగాయలు అందించారు. ప్రజలు ఎవరూ బయటకు రావాల్సిన అవసరం లేకపోవటంతో అక్కడి మార్కెట్లో జన సంచారం తగ్గింది.
ఇదీ చదవండి: కరోనా ఉన్మాదం: బాధితుల మూత్రం సీసాలు విసిరి...