యానాంలోని గ్రామీణ ప్రాంతాల్లో వీరభద్రుని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వీరభద్ర స్వామిని.. ఇంటికి ఇలవేల్పుగా కొలిచే వారంతా విభూదితో తయారుచేసిన సర్పం విగ్రహాలను అందంగా అలంకరించారు. ఆ ఘట్టాలను తలమీద పెట్టుకుని భక్తులంతా కలిసి శరభ.. శరభ.. అంటూ గౌతమి గోదావరి నదీ తీరం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులందరూ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సంబరాలు పురస్కరించుకుని గ్రామాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు