కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: