ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతి నిరాకణ - news on vadapalli venkateswara swamy news

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తోన్న భక్తులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆలయ ఈఓ తెలిపారు.

no entry for visiting of lord venkateswara
వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతించని అధికారులు
author img

By

Published : Jun 13, 2020, 11:58 AM IST

కరోనా దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం నిలిపివేశారు. దీనివల్ల ఆ గ్రామంలోకి భక్తులు ఎవర్నీ రానీయకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వాడపల్లి ప్రధాన రహదారికి అడ్డంగా భారీ గేట్లు ఏర్పాటు చేసి... ఆలయానికి వచ్చే భక్తులను వెనక్కి పంపుతున్నారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి...ఏడు శనివారాల నోము నోచుకుని భక్తులు రానున్న సమయంలో ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా స్వామి దర్శనం నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఆదివారం నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయని...అందుకు భక్తులు ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాలని ఈఓ కోరారు.

ఇదీ చూడండి: రిటైల్ రంగంపై కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.