కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలను అధికారులు లెక్కించారు. 34 రోజులకుగాను మొత్తం రూ.22,85,328 ఆదాయం సమకూరింది. అందులో ప్రధాన హుండీ నుంచి నగదు రూ. 21,16,241, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 1,69,087 ఆదాయం వచ్చింది. బంగారం 21 గ్రాములు, వెండి 169 గ్రాములు కూడా కానుకల రూపంలో సమకూరాయని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
ఇదీ చదవండి: