కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. కొవిడ్ కారణంగా స్వామి వారి కల్యాణోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అంకురార్పణ నిర్వహించి కల్యాణోత్సవం చేశారు. అనంతరం ధ్వజారోహణ జరిపి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ఊరేగించారు.
ఇదీ చదవండీ..డెభ్బై రెండేళ్ల వయసులో మాస్టర్ అథ్లెట్‌గా దూసుకెళ్తున్న మహిళ