భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు నిండి కాస్త తోపులాట జరిగింది. ఏడు ప్రదక్షిణలు చేసేందుకు వచ్చిన భక్తులు భారీగా ఉన్న కారణంగా.. చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడమే తోపులాటకు కారణమని అసంతృప్తి చెందారు.
vadapalli-temple-east-godavari
Intro:AP_RJY_56_09_VADAPALLI_RADDI_AV_AP10018
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా భక్తులు ఆలయంలోకి రావడంతో ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా ఖాళీ లేకపోవడంతో చిన్న పిల్లలు వృద్ధులు అవస్థలు పడ్డారు.
Body:ఆలయ ప్రాంగణంలో ఒక పక్క స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు క్యూలైన్లు నిండిపోవడం,మరొక ప్రక్క ప్రదక్షిణలు చేసే వారితో ఆలయం భక్తులతో నిండిపోయింది. ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆలయ అధికారులు సపర్యలు చేశారు. ఇంత రద్దీ గా ఉన్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం గేట్ల వద్ద మాత్రమే బందోబస్తు ఉంటూ చేతులు దులుపుకుంటున్నారు. లక్షలాది భక్తులు ఆలయానికి వస్తున్న పోలీసులు సరైన బందోబస్తు నిర్వహించడం లేదు. పోలీసుల తీరు పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు
Conclusion:..