తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నేడు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేవాదాయ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి యథావిధిగా దర్శనాలు ప్రారంభమవుతాయని కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
ఇదీ చూడండి