తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం.. వశిష్ఠ గోదావరి వంతెన వద్దకు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని... చాతిపై నవ్య, కుడి చేతిపై శ్రీదేవి అని పచ్చబొట్టు ఉందని.. ముదురు నీలం రంగు టీషర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీఆర్వో విశ్వనాథ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదీ చదవండి...