UNION MINISTER MURALEEDHARAN FIRES ON YCP: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టామని.. మరో రూ.30 వేల కోట్ల ఇతర ప్రాజెక్ట్‌లు మంజూరు చేశామని రాజమహేంద్రవరంలో చెప్పారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని.. అందువల్లే కొన్ని ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నాయని అన్నారు.
జనసేనతోనే భాజపా పొత్తు ఉంటుందని.. పవన్‌తో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌ల సమావేశంలో ముఖ్య అతిధిగా మురళీధరన్ పాల్గొన్నారు.
మైండ్ గేమ్ పాలిటిక్స్‌తో వైసీపీ పరిపాలన: ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభలు పెట్టి ప్రజలకు వివరించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. మైండ్ గేమ్ పాలిటిక్స్‌తో వైసీపీ పరిపాలన సాగిస్తోందని వీర్రాజు అన్నారు. భాజపా జాతీయ నాయకుడు శివప్రసాద్, ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు.
ఇవీ చదవండి: