తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలోని.. రైల్వే వంతెనపై రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, చెల్లెలుతో కలిసి.. విశాఖ నుంచి తునికి రైలులో వచ్చారు. తుని పక్కనే ఉన్న పాయకరావుపేట లింగాల కాలనీలో వీరికి ఇల్లు ఉంది. ఇంటికి వెళ్లేందుకు దగ్గరని.. రైలు వంతెన పై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సూపర్ ఫాస్ట్ రైలు వీరిని ఢీకొట్టటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు మత్యం, సూర్యాకాంతంగా గుర్తించారు. మత్యం భర్త ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మృతదేహాలు ఛిద్రం కాగా.. ఓ మృతదేహం తాండవ నదిలో పడింది.
ఇదీ చదవండి: కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న తెదేపా మహిళ అభ్యర్థిపై దాడి