కాకినాడలోని సామాన్య ఆసుపత్రిలో రెండు స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి పీడితులు ఇద్దరూ మహిళలే కావడం గమనార్హం. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు
కెనడా, దుబాయ్, మలేషియా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన నలుగురికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. వారిని కాకినాడ జీజీహెచ్‌లోని కరోనా వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నమూనాలు పరీక్ష నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్‌కు పంపారు. రేపు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి: