తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి కరకట్ట దిగువ భాగం వరదలో ఇద్దరు గల్లంతయ్యారు. పాతపట్నానికి చెందినవారు గోదావరి వరద ప్రవాహన్ని చూడటానికి వెళ్లారు. అప్పనపల్లి- పాశర్లపూడి కట్టపై నడుస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రవాహంలో మరొక వ్యక్తి పడిపోగా పక్కనే ఉన్న కానిస్టేబుల్ కాపాడాడు. ఇద్దరు యువకులు గల్లంతైన ప్రదేశాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి.