తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో.. 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనతో ఇరుగుపోరుగు వారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో తమ సామగ్రి అంతా కాలి బూడిదయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: