తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ముంగండ గ్రామం వద్ద ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో బాలరాజు, రామారావు అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిద్దరూ ద్విచక్రవాహనం పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు తమ ద్విచక్ర వాహనాన్ని అకస్మాత్తుగా పక్కకి తిప్పడంతో ప్రమాదం జరిగింది.
దీంతో రామారావు, బాలరాజు కింద పడి గాయపడ్డారు. ఆ సమయంలో ఇద్దరమ్మాయిలు కొద్దిసేపు ఆగారు. అటుగా వెళుతున్న కొందరు ఆగి గాయపడిన వారికి సపర్యలు చేశారు. అదే అదనుగా ఆ ఇద్దరు అమ్మాయిలు వారి మోటార్ సైకిల్ పై అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరనేది తెలియదని గాయాలైన వ్యక్తులను ఆసుపత్రికి పంపినట్లు ఏఎస్ఐ టీ.శ్రీనివాస రావు తెలిపారు.
ఇదీ చదవండి శిథిలావస్థకు చేరుకున్న గోరింకల మురుగు కాలువ పైవంతెన