తితిదే నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కాకినాడలోని బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర దేవస్థానంలో గోమాతకు పూజలు చేశారు. దేశంలోని ఆలయాలు, మఠాలకు తితిదే తరఫున గోవులను దానంగా ఇస్తున్నామని తెలిపారు.
అలాగే బలహీన వర్గాలు, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాలు నిర్మించనున్నట్లు వివరించారు. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని పది రోజుల పాటు... వైకుంఠ ముఖ ద్వారం నుంచి దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ప్రత్యేక దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు నమోదు చేసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి: