తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ నియంత్రణ రెండో దశలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా వారియర్స్‌కు సన్మానం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందించిన వైద్య, పోలీస్, సచివాలయ శాఖలకు చెందిన కరోనా వారియర్స్ ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, జి.రాజకుమారి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అదనపు ఎస్పీ కరణం కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గౌరీశ్వర రావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడమే లక్ష్యమా..? : లోకేశ్