ETV Bharat / state

బాధితుల కోసం పలు చోట్ల కొవిడ్ చికిత్సకు ఏర్పాట్లు - covid cases in east godavari

తూర్పుగోదావరిలో కేసులు రోజురోజుకు అధికమవుతుండటంతో.. వివిధ ప్రాంతాల్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో 50 పడకలను అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

collector muralidhar reddy
collector muralidhar reddy
author img

By

Published : May 15, 2021, 1:03 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రోజూ 3,500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని.. యాక్టివ్ కేసులు 30 వేలకు చేరుకున్నాయని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. బాధితుల అవసరాల మేరకు వివిధ ప్రాంత్రాల్లో కొవిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో 50 పడకలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలు ఉల్లంఘించి వైద్యం అందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 50 శాతం పడకలు, రెమ్​డెసివిర్ సక్రమ వినియోగం, నాన్ ఆరోగ్య శ్రీ రోగుల నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫీజుల వసూలు తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్‌ సంక్షోభం అంచున స్విమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.